భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తినేస్తున్నాయి. వాటి యజమానులు నిర్లక్ష్యంగా వదలడం వల్లనే మేకలు హరితహారం మొక్కలు నాశనం చేస్తున్నాయని భావించిన మున్సిపల్ అధికారులు వాటిని బంధించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
హరితహారం మొక్కలు తిన్న మేకల యజమానులకు జరిమానా! - హరితహారరం
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లందు పట్టణంలో ప్రధాన రహదారి వెంట హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తినేస్తున్నాయి. పట్టణంలో మేకలను యధేచ్ఛగా రోడ్లపైకి వదిలిన యజమానుల నిర్లక్ష్యం వల్లనే హరితహారం మొక్కలు తినేస్తున్నాయని గ్రహించిన మున్సిపల్ అధికారులు.. వాటి యజమానులకు జరిమానా విధించారు.
![హరితహారం మొక్కలు తిన్న మేకల యజమానులకు జరిమానా! Illandu Municipal officers Fine On Goats Owners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8187101-697-8187101-1595833443079.jpg)
హరితహారం మొక్కలు తిన్న మేకలకు జరిమానా!
2019 పురపాలక చట్టం అమలు చేస్తూ.. మేకల యజమానులకు జరిమానా విధించారు. మొక్కలను తిన్న మేకల యజమాని మాధవ లొద్దికి రూ.9 వేలు జరిమానా విధించి.. మరోసారి ఇలా జరగకుండా చూసుకొమ్మని హెచ్చరించారు. పట్టణంలో మేకలు, ఇతర పశువుల యజమానులు వాటిని రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని, లేదంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు