భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టారు పురపాలక అధికారులు. వాటిని మధ్యలోనే వదిలేయడం వల్ల దుకాణాదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పురపాలక సిబ్బంది డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఓ టెంట్ హౌజ్ యజమాని డ్రైనేజిని దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం వల్ల తలకు తీవ్ర గాయమైంది.
అధికారుల నిర్లక్ష్యంతో ఆగమవుతున్న ప్రజలు - illandhu people facing drinage problems
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పురపాలక సిబ్బంది చేపట్టిన డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవలే ఓ వ్యక్తి డ్రేనేజీ దాటే ప్రయత్నం చేసి అందులో పడిపోయాడు. అతని తలకు తీవ్ర గాయమైంది.
అధికారుల నిర్లక్ష్యంతో ఆగమవుతున్న ప్రజలు
నెలల తరబడి జాప్యం చేయడం వల్ల తాము చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని పట్టణవాసులు వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణాల్లో జాప్యం చేయడమే కాకుండా నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
TAGGED:
drinage problems in illandhu