భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ మొత్తం 30 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 36 పంచాయతీల్లో 200 నుంచి 300 కుటుంబాలకు ఆ కూరగాయలను అందజేశారు.
30 టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
లాక్డౌన్ కష్టకాలంలో ఇల్లందు ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని చాటుతూ... నిరుపేద ప్రజలకు ఈ రోజు 30 టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడం వల్ల పార్టీ శ్రేణులంతా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![30 టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే MLA HARIPRIYA DISTRIBUTED VEGITABLES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7013041-80-7013041-1588313841482.jpg)
30 టన్నుల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే హరిప్రియ జన్మదినం కావడం వల్ల కార్యకర్తలు, పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...