భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బడ్జెట్లో తమ కోసం రూ.3000 కోట్లు కేటాయించడమే గాక.. ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
'మహిళలు ఆర్థికంగా బలపడే రంగాలు ఎంచుకోవాలి' - bhadradri kothagudem district news
బడ్జెట్లో తమకు రూ.3000 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియల చిత్రపటాలకు కొత్తగూడెం జిల్లా ఐకేపీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. తమ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రతిరంగంలోనూ మహిళలు విజయం సాధించాలని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడే రంగాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ నియోజకవర్గమైన ఇల్లందులో విద్యావంతులైన యువతకు ఇటీవల పారిశ్రామిక శిక్షణ అధికారుల చొరవతో ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు.
- ఇదీ చదవండి :'మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇదే సరైన సమయం'