తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమ్మెను అణిచివేస్తే పోరాటాలు మరింత ఉద్ధృతం' - tsrtc workers strike in bhadadri kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. వెంటనే తమ సమస్యలు తీర్చేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా సమ్మెను ఉద్ధృతం చేయాలి : జిల్లా జేఏసీ

By

Published : Nov 15, 2019, 11:10 AM IST

ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను అణిచేసే ప్రయత్నాలు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. మణుగూరు ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన కార్మికుడు నాగేశ్వర్​ మృతి పట్ల కొద్ది నిమిషాల మౌనం పాటించారు. కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా సమ్మెను ఉద్ధృతం చేయాలని జేఏసీ నాయకుడు రాంబాబు సూచించారు.
ఎన్ని రోజులైనా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొనాలని నాయకులు స్పష్టం చేశారు. రోజు రోజుకీ కార్మిక మరణాల సంఖ్య పెరుగుతోందని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.

కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా సమ్మెను ఉద్ధృతం చేయాలి : జిల్లా జేఏసీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details