భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో హరితహారం కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో గౌతమ్ వేప, రావి మొక్కలను నాటారు. అడవులు అంతరించిపోవటం వలన వాతావరణ సమతుల్యం లోపించి అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. ఉష్ణోగ్రతను తగ్గించాలంటే ప్రధానంగా మొక్కలు నాటడమే అందరి లక్ష్యం కావాలన్నారు.
'పర్యావరణ రక్షణకు ఉద్యమంగా మొక్కలు నాటాలి' - 6వ విడత హరితహారం కార్యక్రమం తాజావార్తలు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఐటీడీఏ పీవో గౌతమ్ సూచించారు. ఆరోవిడత హరితహారం పురస్కరించుకుని కార్యాలయం ప్రాంగణంలో వేప, రావి మొక్కలను నాటారు.
పర్యావరణ రక్షణకు ఉద్యమంగా మొక్కలు నాటాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రధాన కూడళ్లలో మొక్కలు నాటాలని కోరారు. సమష్టి కృషి ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
TAGGED:
6వ విడత హరితహారం కార్యక్రమం