భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తైంది. గత నలభై ఆరు రోజుల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి అభరణాలను లెక్కించారు.
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే.. - భద్రాచలం వార్తలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. గత నెలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలతో ఈసారి ఆదాయం పెరుగుతుందని భావించినా.. పెద్ద మార్పేమీ కనిపించలేదు.
![భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే.. hundi counting at bhadrachalam lord srirama temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5970951-27-5970951-1580915358769.jpg)
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..
రూ. 73 లక్షల 38 వేల 315 నగదు, 60 గ్రాముల బంగారం, ఆరు వందల గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. 467 అమెరికా డాలర్లు, మలేషియాకు చెందిన 3 రింగెట్స్తో పాటు పలు దేశాల నగదు కానుకగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా.. హుండీ ఆదాయం పెరగవచ్చని అధికారులు భావించారు. ఎప్పటి మాదిరిగానే ఆదాయం వచ్చింది.
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎంతంటే..