పారిశుద్ధ్య పనులు చేస్తుండగా భారీ కొండచిలువ బయటపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి(Python at Hospital)లో చోటుచేసుకుంది.
పనులు చేస్తున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికులు భారీ కొండ చిలువను గమనించారు. భయాందోళనలకు గురైన వారంతా పరుగులు తీశారు. అనంతరం కొంతమంది ధైర్యం చేసి భారీ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలివేశారు.