భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఉపరితల గని శివారు ప్రాంతంలో బొగ్గు వెలికితీసేందుకు చేసిన బ్లాస్టింగ్‌తో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలో ఆ ప్రాంతంలో బొగ్గు, రాళ్లు చేరడం చేత స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఉపరితల గనిలో బ్లాస్టింగ్ పనులు జరగడం, కొంతమేర పొగలు రావడం సహజం కానీ... దట్టమైన పొగలతో పాటు బొగ్గు, రాళ్లు శివారు ప్రాంతంలో పడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున పొగలు... స్థానికుల ఆందోళన - yellnadu Opencast news
ఉపరితల గని బ్లాస్టింగ్‌తో శివారు ప్రాంతంలో దట్టమైన పొగలతో పాటు రాళ్లు పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన దృశ్యాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకున్నాయి.
పెద్ద ఎత్తున పొగలు... స్థానికుల ఆందోళన
ఇదీ చూడండి :రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్ కుమార్