BHADRADRI TEMPLE: ఆదివారం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్ష్మణ సమేత సీతారాముల మూల మూర్తులకు పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
స్వామివారికి విశేష పూజల సమయంలో భక్తులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ఇదే సమయంలో కొందరు ఆలయ సిబ్బంది వెనక ద్వారం నుంచి భక్తులను అనుమతించడం విమర్శలకు తావిస్తోంది.