భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీసీ బాలికల వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు రహదారిపై ధర్నా నిర్వహించారు. వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులకు న్యాయం జరిగేలా అధికారులతో మాట్లాడతానని పోలీసులు హామీ ఇచ్చి నిరసన విరమింపచేశారు.
నూతన వసతి గృహం నిర్మించాలని ఎన్నిసార్లు చెప్పాలి ? - undefined
వసతి గృహనికి నూతన భవనం కేటాయించాలని విద్యార్థినులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాపోయారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా