తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందులో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు

ఇళ్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఇల్లందు పట్టణ వాసులకు అవకాశం కల్పించాలన్న మున్సిపల్​ ఛైర్మన్ చేసిన విజ్ఞప్తికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ సానుకులంగా స్పందించారు. గడువు పెంచేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Houses Regulation deadline increased in Illandu city in Bhadradri kothakugem district
ఇల్లందులో క్రమబద్ధీకరణ గడువు పెంపు

By

Published : May 28, 2020, 4:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణవాసులకు శుభవార్త. పట్టణంలో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును పెంచాలని మున్సిపల్​ ఛైర్మన్​ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్​ సానుకులంగా స్పందించారు. గడువు పెంచేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని... దీనిపై తర్వలో తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు అభినందనలు తెలిపారు.

పట్టణంలో ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొంత మందికి అవగాహన లేక చేసుకోలేక పోయారని మరో అవకాశం ఇస్తే 100% గృహ యజమానులు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనివలన పురపాలక సంఘానికి ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details