తెలంగాణ

telangana

ETV Bharat / state

వెయ్యి మంది వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ - హోప్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వెయ్యి మంది వలసకూలీలకు దాతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన హోప్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు ఏడు రకాల సరుకులు అందించి దాతృత్వం చాటుకున్నారు.

Hope is a charity that distributes essential goods
వెయ్యి మంది వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Apr 5, 2020, 7:18 PM IST

Updated : Apr 5, 2020, 8:32 PM IST

లాక్​డౌన్​ సందర్భంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు దాతలు అండగా నిలబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు మండలంలో వెయ్యిమంది వలస కూలీలకు ఖమ్మం పట్టణానికి చెందిన హోప్​ చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా లారీ ద్వారా కాకర్ల, అనంతారం, రామచంద్రాపురం గ్రామాల్లో తిరిగి సరకులు అందజేశారు.

కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ రమణారెడ్డి, జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సై శ్రీకాంత్‌, ఇతర శాఖల అధికారులు కలిసి కూలీలకు అందజేశారు. పెద్దసంఖ్యలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ట్రస్టు సభ్యులను అధికారులు అభినందించారు. ప్రతి ఒక్కరూ పేదలకు తోడుగా నిలవాలని సూచించారు.

వెయ్యి మంది వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ

ఇదీ చూడండి:ఐఏఎస్​ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం

Last Updated : Apr 5, 2020, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details