భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలతో కూడిన కరపత్రాలను అందించారు. హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి కులవరం రోడ్డు వరకు హెల్మెట్లతో కూడిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్‌లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ - హెల్మెట్
వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోవడంతోనే విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న ద్విచక్రవాహనదారుల్లో ఎక్కువ మంది హెల్మెట్ వాడనివారేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భద్రాచలంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ