భద్రాచలం జిల్లాలో.. రెండురోజులుగా ఉష్ణోగ్రత భారీగా పెరిగింది. బుధవారం 42.5 ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఇవాళ 44 డిగ్రీల వరకు నమోదైందని అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత పెరగడంతో భద్రాచలంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కొన్ని చోట్ల సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భద్రాచలంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు - తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రెండు రోజులుగా గాలిలో తేమశాతం తగ్గిపోవడం వల్ల... పొడి వాతావరణం నెలకొంది.
భద్రాచలంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు