భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెరువులు అలుగు పోస్తుండగా... వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వాన నీరు చుట్టుముట్టింది.
ఇల్లందులో భారీ వర్షం... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి - తెలంగాణ తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఇల్లందులో భారీ వర్షం... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
పట్టణంలోని బుగ్గవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది... ఇల్లందులో పాడు చెరువు అలుగు పోస్తోంది. వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.