రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, ఇల్లందులో భారీ వర్షం ముంచెత్తింది. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో వాన కురవడంతో కూరగాయలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
RAIN: భద్రాద్రిలో భారీ వర్షం.. ఇబ్బందుల్లో చిరు వ్యాపారులు - ఇల్లందులో వర్షాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఇల్లందుతో సహా పలు మండలాల్లో భారీ వర్షం పడింది. లాక్ డౌన్ మినహాయింపు వేళల్లో వాన కురవడంతో చిరువ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు
రెండు రోజులుగా భానుడి ప్రతాపానికి విలవిలలాడిన వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచి జిల్లాలోని భద్రాచలం బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఒకసారి వాతావరణం మొత్తం చల్లగా మారింది.