తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడతెరిపిలేని వానలు... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - rains news

అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.

heavy rains in ashwarao pet constituency in bhadradri kothagudem district
అశ్వరావుపేట నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

By

Published : Oct 13, 2020, 1:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. పదుల సంఖ్యలో పశువులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

ప్రధానంగా అశ్వారావుపేట- వేలేరుపాడు రహదారిపై నుంచి పెద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడం వల్ల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షం కారణంగా పలుచోట్ల జనజీవనం స్తంభించింది. పలుప్రాంతాల్లో ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇవీ చూడండి: తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం

ABOUT THE AUTHOR

...view details