భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు అలుగు పోస్తూ కనువిందు చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంట పొలాలు నీట మునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి.
ఎడతెరిపిలేని వానలు.. అలుగు పోస్తున్న చెరువులు - heavy rains in bhadradri district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో జోరువానలతో పలు చెరువులు అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఎడతెరిపిలేని వానలు.. అలుగు పోస్తున్న చెరువులు
ఇల్లందు మండలంలోని ముకుందాపురం పెద్దచెరువు, రాగబోయినగూడెం పెద్ద చెరువు, ఇల్లందు పట్టణంలోని చెరువులు అలుగు పోస్తూ కనువిందు చేస్తున్నాయి. ఇల్లందు పాడు చెరువును పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మరోవైపు టేకులపల్లి మండలంలో తుమ్మల చిలకలో పత్తి పొలాలు నీట మునిగాయి. టేకులపల్లిలోని ఇనప మోరి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. టేకులపల్లిలోని ఏ కాలనీలో వరి పొలాలు నీట ముగిగాయి. ఇల్లందులో 116 మిల్లీ మీటర్లు, టేకులపల్లిలో 108.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.