బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వాన కురుస్తోంది. పలు పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ వర్షం ఏకధాటిగా కురుస్తున్నందున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం... రోడ్లు జలమయం - భద్రాద్రి కొత్తగూడెం రెయిన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
![భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం... రోడ్లు జలమయం heavy rain in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9155937-832-9155937-1602567352083.jpg)
భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం... రోడ్లు జలమయం
ఎడతెరిపి లేని వర్షం కారణంగా కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంవీవీ రెడ్డి సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షం... రోడ్లు జలమయం
ఇదీ చదవండి:భాగ్యనగరంలో ఉదయం నుంచి భారీ వర్షం