భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భద్రాచలం పరిధిలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బుజ్జాయి గూడెం పంచాయతీ పరిధిలోని ఇల్లందు-కొత్తగూడెం రహదారిపై ఈదురుగాలుల వల్ల భారీ వృక్షం కూలింది. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇల్లందు పట్టణంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడం వల్ల గత కొన్ని రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణవాసులు కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలుల కారణంగా కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఇల్లందు ఉపరితల బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలిగింది. అశ్వాపురం మండలం, బూర్గంపాడు, చర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. పినపాక నియోజకవర్గ పరిధిలోని ఆళ్లపల్లి, గుండాల, మణుగూరు మండలాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం - rainstorm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పలు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోవడం వల్ల ట్రాఫిక్‌తో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Breaking News
ఇవీ చూడండి: జోరు వానలో తడిసిన భాగ్యనగరం