భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇల్లందు, టేకులపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడు, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీవర్షం.. - heavy rain in bhadradri district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై... ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇల్లందు, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీవర్షం..
మంగళవారం అక్కడక్కడ జల్లులు కురవగా బుధవారం మాత్రం భారీ వర్షం నమోదయ్యింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.