కరోనా సమయంలోనూ నిత్యం రద్దీగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రధాన వీధుల్లోని కూరగాయల మార్కెట్లో జన సంచారం తగ్గింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. భారీ స్థాయిలో చేపట్టిన బుగ్గవాగు ప్రక్షాళనతో వాగు నీటితో నిండి చిన్నపాటి నదిలా ప్రవహించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. రోడ్లుపై తగ్గిన జనసంచారం - latest news of bhadradri kothagudem
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జన సంచారం తగ్గింది. కొనుగోలు దారులు లేక కూరగాయల మార్కెట్ వెలవెలబోయింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. రోడ్లుపై తగ్గిన జనసంచారం