భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు మట్టి కట్టకు గండి పడటం వల్ల గోదావరి వరద నీరు మొత్తం ప్రాజెక్టు కాలువలోకి వచ్చి చేరింది. ఫలితంగా కాలువ పూర్తిగా నీటితో నిండిపోయింది.
సీతారామ ప్రాజెక్టు కాలువలోకి భారీగా వరద నీరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు మట్టి కట్టకు గండి పడింది. ఫలితంగా గోదావరి వరద నీరు మొత్తం ప్రాజెక్టు కాలువలోకి వచ్చి చేరుతోంది.
సీతారామ ప్రాజెక్టు కాలువలోకి భారీగా వరద నీరు
ఆనందపురం, అమ్మగారిపల్లె, నెల్లిపాక, చింతిర్యాల, అమెర్దా గ్రామాల ప్రధాన రహదారులపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పినపాక మండలంలోని మొద్దులగూడెం-సింగారెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కిందగుంపు ఒర్రె పొంగటంతో వాగుబోయిన గిరిజన గ్రామం నీటిలో చిక్కుకుంది. సుమారు 20 కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.