భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా సింగరేణిలోని జేకే ఉపరితల గని 47 లెవెల్ ఫిల్టర్‌బెడ్ ఓబీ డంపు ప్రాంతంలో హరితహారం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ అధికారులు, సిబ్బంది ఐదు వేల మొక్కలను నాటారు.
ఇల్లందు సింగరేణి ఏరియాలో వనమహోత్సవం
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇల్లందు ఏరియా సింగరేణిలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ పెద్ద ఎత్తున ఐదు వేల మొక్కలను నాటారు. సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా సింగరేణి అన్ని ఏరియాలలో ఒకే సారి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు జీఎం సత్యనారాయణ తెలిపారు.
ఇల్లందు సింగరేణి ఏరియాలో వనమహోత్సవం
సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా సింగరేణి అన్ని ఏరియాలలో ఒకే సారి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు జీఎం సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు బండి వెంకటయ్య, ఏజెంట్ బొల్లం వెంకటేశ్వర్లు, పర్యావరణ అధికారి సైదులు, జేకే ఉపరితల గని మేనేజర్ రామస్వామి సెక్యూరిటీ అధికారి నందిగం శ్రీనివాసరావు, కార్మిక సంఘం యునియన్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.