తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెరాస కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విప్‌గా ఎంపికైన తర్వాత తొలిసారి భద్రాద్రి జిల్లాకు విచ్చేస్తున్న రేగాకు జిల్లా సరిహద్దు జూలూరుపాడు వద్ద పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో ఖమ్మం- కొత్తగూడెం రహదారి వినోబా నగర్ వద్ద స్తంభించిపోయింది.
ప్రభుత్వ విప్ రేగాకు అభిమానుల ఘనస్వాగతం - ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి తమ జిల్లాకు వచ్చిన రేగా కాంతారావుకు ఘనస్వాగతం పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు.
ప్రభుత్వ విప్ రేగకు అభిమానుల ఘనస్వాగతం