భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వాన కురవగా పట్టాలు కప్పే అవకాశం లేకుండా పోయింది.
పట్ట’లేని ఆవేదన - sudden rain in pinapaka
అప్పటిదాకా భగభగలాడిన బానున్ని ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయి. ఆ వెంటనే వరణుడు తన ప్రతాపం చూపించాడు. ఆరుగాలం పండించిన పంటపై పట్టాలు కప్పే సమయం కూడా ఇవ్వలేదు. కళ్ల ముందే తమ కష్టమంతా నీటిపాలవుతుండటం చూసి అన్నదాతలు ఆవేదన చెందడం తప్ప ఏమీ చేయలేక పోయారు.

కరకగూడెంలో తడిసిన ధాన్యం
అశ్వాపురంలో ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పైరును భాజపా నాయకులు వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బిజ్జంరెడ్డి, బాలూనాయక్, అయిలయ్య సోమవారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.