ఉద్యోగుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని తెజస అధ్యక్షుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లా పట్ట భద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
'స్వార్థ ప్రయోజనాల కోసం అధికారం దుర్వినియోగం' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తోందని తెజస అధ్యక్షుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. అధికారాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పీఆర్సీ, వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడికి తట్టుకోలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం వస్తే కాంట్రాక్టు వ్యవస్థ ఉండదన్న కేసీఆర్.. ఇప్పటికే లక్షా 64వేల మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలను ఓడించేందుకు హక్కుల కోసం పోరాడుతున్న.. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రుల ఓటర్లను కోదండరాం అభ్యర్థించారు.