తెలంగాణ

telangana

ETV Bharat / state

నలభై ఎళ్లుగా ఉద్యమకారుడిగా ప్రజాజీవితంలోనే ఉన్నా: చెరుకు - ఇల్లందులో చెరుకు సుధాకర్ ఎన్నికల ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్​... ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యమకారుడిగా ప్రజా జీవితంలో ఉన్న తనను శాసనమండలికి పంపించాలని కోరారు.

graduate mlc candidate cheruku sudhakar election campaiagn illandu
నలభై ఎళ్లుగా ఉద్యమకారుడిగా ప్రజాజీవితంలోనే ఉన్నా: చెరుకు

By

Published : Nov 20, 2020, 3:34 AM IST

నలభై ఏళ్ల నుంచి ఉద్యమకారుడిగా ప్రజాజీవితంలోనే ఉన్నాని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్​ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేక సమస్యల పట్ల పోరాటం చేశానని గుర్తుచేశారు.

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిపించినట్టు శాసనమండలి ఎన్నికల్లో కూడా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని చెరుకు సుధాకర్ కోరారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఉద్యమ ఉనికిని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు తమ అభ్యర్థిత్వం పట్ల పునఃపరిశీలన చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details