తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరద ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా' - Governor Tamilisais visit to the flood affected areas of Bhadrachalam

వరద ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ తమిళిసై తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గోదావరి వరద ముంపు బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం అశ్వాపురంలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి.. బాధితులకు మందులు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

By

Published : Jul 17, 2022, 12:09 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు తమ సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని తమిళిసై సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్​ ముంపు బాధితుల సమస్యలు విన్నానని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సాయంత్రం చింతిర్యాల, గౌతమినగర్‌ ప్రాంతాల్లో ఆమె పర్యటించి.. వరద సహాయక సామగ్రిని అందజేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details