భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులోని ఓసీ గనిలో గురువారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. బొగ్గు గనుల వల్ల అటవీ ప్రాంతానికి జరిగే నష్టాన్ని పూడ్చేందుకు సింగరేణి సంస్థ మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మానవాళి ప్రమాదంలో పడినందున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
'సింగరేణి సంస్థ ఎక్కువ మొక్కలను నాటాలి' - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచటంలో సింగరేణి ఎక్కువ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరు ఓసీ గని ఆవరణలో జరిగిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
సింగరేణి సంస్థ తమ పరిధిలోనే కాకుండా సమీప ప్రాంతాల్లో కూడా మొక్కలు పెంచితే బాగుంటుందని రేగా కాంతారావు అన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. మణుగూరు అధికార యంత్రాంగం సింగరేణి సంస్థకు ఇచ్చిన పది లక్షల మొక్కలను నాటి లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అన్ని ఏరియాల్లో 40 లక్షల మొక్కలు నాటడం సింగరేణి సంస్థ నిబద్ధతకు నిదర్శనమని సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరాం తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు