భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుగ్గ పంచాయతీలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాను ప్రభుత్వ విప్రేగా కాంతారావు ప్రారంభించారు. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని రేగా కాంతారావు అన్నారు.
మిషన్ భగీరథ నీటిని ప్రారంభించిన రేగా కాంతారావు - నల్లా తిప్పి నీటిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు మండలం బుగ్గ పంచాయతీలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాను రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కుళాయి తిప్పి నీటిని ప్రారంభించారు.
నల్లా తిప్పి నీటిని ప్రారంభించిన ప్రభుత్వ విప్
ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు వస్తుందన్నారు. గ్రామస్థులతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న చెక్‌డ్యామ్‌లను ఆయన పరిశీలించారు. సీఎం కేసీఆర్ అనేక పథకాల అమలు చేసి పేదల కష్టాలు తొలగిస్తున్నాడని కొనియాడారు.
ఇదీ చూడండి :పసిడి ధర రూ. 50,100..ఆదిలాబాద్ చరిత్రలో అత్యధికం..!