తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లన్న, రాళ్లవాగును పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు - తహసీల్దార్ కార్యాలయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు. గుండాల మండల పరిధిలోని మల్లన్న వాగు, రాళ్ల వాగు ప్రాంతాలను పరిశీలించి వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారుల ఆదేశించారు.

మల్లన్న, రాళ్లవాగును పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మల్లన్న, రాళ్లవాగును పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

By

Published : Aug 23, 2020, 3:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పర్యటించారు. గుండాల మండల పరిధిలోని మల్లన్న వాగు, రాళ్ల వాగు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారుల ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలి...

ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుండాలలో జరిగిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం అల్లపల్లి మండలంలో పర్యటించి రాయపాడు బ్రిడ్జిని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఇవీ చూడండి : ఏం చేసినా స్త్రీ శక్తే... స్వయం శక్తే... దటీజ్‌... శారద !

ABOUT THE AUTHOR

...view details