ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జాదవ్ బలరాంకు అపూర్వ గౌరవం దక్కింది. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఐదు వందల మంది విద్యార్థులు రక్తదానం చేసి గురుభక్తి చాటుకున్నారు.
గురువుకు శిష్యుల అరుదైన బహుమతి - నేరడిగొండ ప్రభుత్వ కళశాల
గురువు జన్మదినం సందర్భంగా విద్యార్థులు ఆయనకు మరచిపోలేని బహుమతినిచ్చారు. సుమారు 500 మంది రక్తదానం చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

గురువుకు శిష్యుల అరుదైన బహుమతి
ప్రిన్సిపల్ను తొలుత కారులో ఊరేగించిన విద్యార్థులు సభ ఏర్పాటు చేసి ఆయన స్పూర్తిని కొనియాడారు. తనకు నిర్వహించిన జన్మదిన వేడుకల పట్ల జాదవ్ బలరాం తన్మయులయ్యారు.
ఇదీ చదవండి:ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం