తెలంగాణ

telangana

ETV Bharat / state

‘నిర్వాసితులకు పదిరోజుల్లో ఉద్యోగాలు’ - భద్రాద్రి థర్మల్​ పవర్​ స్టేషన్​

భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రం భూనిర్వాసితులకు పది రోజుల్లో ఉద్యోగాలు లభించనున్నట్టు ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు తెలిపారు. జెన్​కో సీఎండీ ప్రభాకర్​ రావును కలిసిన ఆయన థర్మల్​ విద్యుత్​ కేంద్రం నిర్మాణం కోసం భూములిచ్చిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఖరారు అయినట్టు స్పష్టం చేశారు.

Government Chief Vip Meets Genco CMD
‘నిర్వాసితులకు పదిరోజుల్లో ఉద్యోగాలు’

By

Published : Jun 12, 2020, 7:05 PM IST

Updated : Jun 12, 2020, 7:35 PM IST

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూనిర్వాసితులకు పది రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నామని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు అన్నారు. హైదరాబాదులో జెన్​కో సిఎండి ప్రభాకర్ రావు, జెన్కో డైరెక్టర్లను కలిసిన రేగా కాంతారావు నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనపై చర్చించారు. బిటిపిఎస్ కు చెందిన 346మంది నిర్వాసితులు ఉద్యోగాల సమస్యను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

కేటీఆర్ ఆదేశాలతో జెన్కో అధికారులు మొదటి విడతగా సీనియారిటీ ప్రకారం 168 మందికి శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని, మిగిలినవారికి విడతలవారీగా ఉద్యోగాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అతి కొద్దికాలంలోనే నిర్వాసితులకు ఉద్యోగాలు రానున్నాయని రేగా హర్షం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేందుకు సహకరించిన కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్​!

Last Updated : Jun 12, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details