తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు - Selling corn seeds is an act of PD

ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా మొక్కజొన్న విత్తనాలు విక్రయించే డీలర్లపై సీడ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Government Agriculture Officers warn to seed Dellars Selling corn seeds is an act of PD
మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

By

Published : Jun 22, 2020, 12:30 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మొక్కజొన్న విక్రయాలు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ దుకాణదారుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మండలంలో మొక్కజొన్న పంటను ప్రోత్సహించవద్దని విత్తన డీలర్లకు, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అయినప్పటికీ ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుండా పోలవరానికి చెందిన ఇద్దరు రైతులకు 60 మొక్కజొన్న ప్యాకెట్లను విక్రయించినట్లు తెలిపారు. మొక్కజొన్న పంట‌కు స‌రైన మార్కెటింగ్, మద్దతుధర లేక అన్నదాతలు ఇబ్బందుల‌ను ఎదుర్కొనే ప్రమాదం ఉంద‌ని హెచ్చరించారు. ఈ పంటకు బదులు సన్నరకం వరి, పత్తి పంటలు వేయాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details