అండర్ -19 వరల్డ్ కప్-2021 మహిళల బీ-జట్టుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ది సిరిస్ త్రిష(cricketer Gongadi Trisha news) ఎంపికయ్యారు. బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రస్తుతం మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికకై ప్రత్యేక టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బీ, ఇండియా-సీ, ఇండియా-డీ జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించింది. ఇందులో ఇండియా-బీ జట్టుకు త్రిష ఆడారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో త్రిష మంచి గణాంకాలు నమోదు చేసి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లో త్రిష మంచి ప్రదర్శన(Gongadi Trisha latest news) కనబరిచారు.
ఈ నెల 2న ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి 158 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు బాదారు. ఇండియా-డీతో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులు చేశారు. ఇండియా-డీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 116 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 10 ఫోర్లు, 1సిక్సర్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. ఈ టోర్నీలో త్రిష మొత్తంగా 260 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా(Gongadi Trisha top scorer) నిలిచారు.