తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రమంగా పెరుగుతోన్న గోదారి నీటిమట్టం - గోదావరి నీటిమట్టం

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 37.7 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం... రాత్రి 8 గంటల వరకు 38.9 అడుగులకు చేరుకుంది.

GODAWARI WATER LEVELS INCRESING
GODAWARI WATER LEVELS INCRESING

By

Published : Sep 1, 2020, 6:32 PM IST

Updated : Sep 1, 2020, 10:00 PM IST

భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం ఆరు గంటలకు 22 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... మంగళవారం ఉదయం 9 గంటలకు 35.7 అడుగులకు చేరింది. రాత్రి 8 గంటల వరకు 38.9 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా గోదావరి నీటిమట్టం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

మంగళవారం రాత్రి లోపు 43 అడుగుల దాటి... మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో... స్నానాలు చేసేందుకు, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్ ఆదేశించారు.

ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

Last Updated : Sep 1, 2020, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details