GODAVARI: ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలు, రాళ్లు రప్పలతో ఎడారిని తలపించిన గోదావరి.. ఇప్పుడు వరదనీరు ఒడ్డును తాకుతూ నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం 12అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. నిత్యావసర వస్తువులు, ఔషధాలు అందుబాటులో ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న గోదావరి... - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
GODAVARI: భద్రాచలంలో గోదావరి జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలు, రాళ్లు రప్పలతో ఎడారిని తలపించిన గోదావరి.. ఇప్పుడు వరదనీరు ఒడ్డును తాకుతూ నిండుకుండను తలపిస్తోంది.
గోదావరి