భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు 35.7 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. బుధవారం ఉదయం 10 గంటలకు 41 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా గోదావరి నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు 41 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
గోదావరి పరివాహక ప్రాంతాల్లో... స్నానాలు చేసేందుకు, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్.. ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
ఇవీచూడండి:క్రమంగా పెరుగుతోన్న గోదారి నీటిమట్టం
Last Updated : Sep 2, 2020, 10:45 AM IST