భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అన్నారం, కమలాపురం, కొండయిగూడెం గ్రామాల సమీపంలోకి వరద నీరు వచ్చి చేరింది. చిన్నరాయి గూడెంలోని కొన్ని కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మణుగూరు మండలంలోని కొండయిగూడెం శివాలయాన్ని గోదావరి నది చుట్టుముట్టింది. గుడిని ఆనుకొని నది ప్రవహిస్తోంది.
మణుగూరులో గోదావరి నది ఉగ్రరూపం - godavari flood news
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తోంది. నది ఉద్ధృతితో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మణుగూరులో గోదావరి నది ఉగ్రరూపం
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంటెక్ వెల్ లోకి వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితిని సీఈ బాలరాజు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. వరద ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రంలో అధికారులు దగ్గరుండి భోజన సదుపాయాలు కల్పించారు.