భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నా.. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల నీటి మట్టం తగ్గుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 61.7 అడుగులు ఉన్న నీటిమట్టం.. నేటి మధ్యాహ్నానికి 54.4 అడుగులకు చేరింది. నీటిమట్టం 53 అడుగులకు తగ్గితే మూడో ప్రమాద హెచ్చరికను ఎత్తివేసే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం - godavari flow decreased at bhadrachalam
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. సోమవారం సాయంత్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు సుమారు 8 అడుగుల మేర తగ్గింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నా.. రామయ్య సన్నిధి సమీపంలోని అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, స్నానఘట్టాల ప్రాంతం ఇంకా నీటిలోనే మునిగి ఉంది.
8463090భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
ప్రస్తుతం భద్రాచలంలోని పలు కాలనీల్లో నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రామయ్య సన్నిధి ఎదురుగానున్న తూర్పు మెట్ల వద్ద వరద నీరు నిల్వ ఉంది. అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, స్నానఘట్టాల ప్రాంతం ఇంకా నీటిలోనే మునిగి ఉంది. ఎంసీ కాలనీ, అయ్యప్పకాలనీ, సుభాశ్ నగర్ రామాలయం సెంటర్లలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాల్లోనే వసతి ఏర్పాట్లు చేశారు.
ఇవీచూడండి:సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు.. సమన్వయమే కీలకం: కేటీఆర్