భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. నిన్న సాయంత్రం నుంచి వరద నీరు కాస్త తగ్గుతూ ఊరటనిస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు నీటిమట్టం 55.8 అడుగులకు చేరింది. చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతుంది.
కాస్త ఊరట: భద్రాచలంలో శాంతిస్తోన్న గోదావరి
నిన్న ఉగ్రరూపం దాల్చి భయపెట్టిన గోదావరి ఈరోజు కాస్త శాంతించింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 55.8 అడుగులకు చేరి... మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతోంది. రెండ్రోజులుగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి.
భద్రాచలంలో స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద
వరద నేపథ్యంలో ఏజెన్సీ, విలీన మండలాలకు రాకపోకలు నిలిచాయి. ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:చరిత్రలోనే ఏడోసారి... భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి
Last Updated : Aug 18, 2020, 10:09 AM IST