తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి మహోగ్రరూపం... 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్ - bhadrachalam godavari flood

Godavari flood danger levels:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 1976 నుంచి 2022 వరకు గోదావరి నీటిమట్టం వివరాలు ఎలా ఉన్నాయో కింది కథనం చదివి తెలుసుకుందాం.

గోదావరి మహోగ్రరూపం
గోదావరి మహోగ్రరూపం

By

Published : Jul 15, 2022, 5:25 PM IST

Godavari flood danger levels: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీపరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి.

1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత 36 ఏళ్లలో 70 అడుగులు దాటడం ఇదే ప్రథమం. భద్రాచలం వద్ద గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం శుక్రవారం 70.10 అడుగుల వద్ద కొనసాగుతుంది. 75 అడుగులు దాటితే.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుంది. ఇప్పటివరకు ఆరుసార్లు 60 అడుగులు, రెండుసార్లు 70 అడుగులు క్రాస్ అయింది. ఎగువ నుంచి గోదావరిలోకి 23.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

  • భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 70.10 అడుగులు
  • భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత మళ్లీ 70 అడుగులు దాటుతున్న గోదావరి నీటిమట్టం..
  • 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
  • ఆరుసార్లు 60 అడుగులు క్రాస్ అయిన గోదావరి నీటి మట్టం
  • రెండు సార్లు 70అడుగులు క్రాస్

భద్రాచలం

ABOUT THE AUTHOR

...view details