భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో నెలరోజులు విశేష పూజలు అందుకున్న స్వామికి బేడా మండపం వద్ద అర్చకులు కల్యాణం నిర్వహించారు.
వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం - Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple Latest News
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భోగి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశ్వక్సేన పూజ, జిలకర బెల్లం, నూతన వస్త్రాల సమర్పణ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి రోజున లక్ష్మణ సమేత సీతారాములకు రథోత్సవం నిర్వహించనున్నారు.
గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం
గోదా రంగనాథ కల్యాణ విశిష్టతను ఆలయ స్థానాచార్యులు తెలియజేశారు. విశ్వక్సేన పూజ, జిలకర బెల్లం, నూతన వస్త్రాల సమర్పణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు వైభవంగా జరిపారు. రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా భద్రాద్రిలో లక్ష్మణ సమేత సీతారాములకు రథోత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై