తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి ఆసుపత్రిలో సౌకర్యాలపై జీఎం సమీక్ష - సింగరేణి తాజా వార్తలు

సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కరోనా వైద్యానికి సంబంధించిన సౌకర్యాలపై డైరెక్టర్​ చంద్రశేఖర్​తో కలిసి జనరల్​ మేనేజర్​ పి.వి.సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్​ బారినపడిన ఉద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు.

GM review meeting on facilities at Singareni Hospital
సింగరేణి ఆసుపత్రిలో సౌకర్యాలపై జీఎం సమీక్షా సమావేశం

By

Published : Jul 23, 2020, 6:54 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాలపై డైరెక్టర్​ చంద్రశేఖర్​తో కలిసి జనరల్​ మేనేజర్​ పి.వి.సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

కరోనా బారినపడిన సింగరేణి ఉద్యోగులకు వైద్యం అందించడం కోసం ముందస్తుగా ఇల్లందు ఏరియా ప్రధాన ఆసుపత్రిలో ఐసోలేషన్​ వార్డు, హోం క్వారంటైన్ కేంద్రాలను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. కొవిడ్ సోకిన ఉద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జీఎం(పర్సనల్) లక్ష్మీనారాయణ, నరసింహారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.నేరేళ్లు, సెక్యురిటీ అధికారి నందిగామ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: ముమ్మరంగా సచివాలయ కూల్చివేత.. వ్యర్థాల తరలింపు

ABOUT THE AUTHOR

...view details