తెలంగాణ

telangana

ETV Bharat / state

Girl protest in front of lover house : ప్రేమించానన్నాడు.. మొహం చాటేశాడు!

Girl protest in front of lover house : ప్రేమించానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇంతలోనే మారిపోయాడు. రూ.30లక్షల కట్నం ఇస్తేనే వివాహం చేసుకుంటానని ఇప్పుడు చెబుతున్నాడు. చేసేది లేక ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

Girl protest in front of lover house, love protest
యువతి ప్రేమ పోరాటం

By

Published : Dec 20, 2021, 4:29 PM IST

Girl protest in front of lover house : ప్రియుడి ఇంటి ముందు నిరసన చేస్తోంది ఓ ప్రియురాలు. ప్రేమించానని చెప్పిన మనిషి... పెళ్లి అనగానే మొహం చాటేశాడని వాపోయింది. వివాహం చేసుకోవాలంటే రూ.30లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నాడని.. తాము అంత ఇచ్చే పరిస్థితిలోలేమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చేసేది లేక ఇలా మౌన పోరాటం చేస్తున్నానని కంటతడి పెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని 21 ఏరియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నో..!

ఇల్లందు మండలానికి చెందిన శ్యామ్ అనే యువకుడు, తాను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని బాధితురాలు తెలిపింది. పెళ్లి విషయం ఎత్తగానే నిరాకరిస్తూ వస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే చాలాసార్లు పంచాయితీ కూడా జరిగిందని చెప్పింది. చేసేది లేక చివరగా ఎమ్మెల్యే హరిప్రియను కూడా కలిసి... తన సమస్య చెప్పినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:CHEATING: ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ముందు యువతి దీక్ష

'ఎవరు చెప్పినా వినడం లేదు'

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... ఓ వైస్​ఛైర్మన్​కు చెప్పిందని బాధితురాలు పేర్కొంది. వారు చెప్పినా కూడా శ్యామ్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. యువకుడు, అతడి కుటుంబ సభ్యులు రూ.30 లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. తాము రూ.5 లక్షల వరకు ఇచ్చేందుకు అంగీకరించినా నిరాకరిస్తున్నారని వివరించింది.

ఇదీ చదవండి: ప్రేమించిన వ్యక్తికి వేరే అమ్మాయితో పెళ్లి... షాకిచ్చిన ప్రేయసి!

'శ్యామ్ అనే యువకుడు నేను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ ఇప్పుడు ముందుకు రావడం లేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇప్పటికే పది పంచాయితీలు అయినయ్. సీపీఐ ఆఫీస్ వాళ్లు కూడా మాట్లాడారు. అయినా కూడా వినలేదు. వాళ్లు రూ.30లక్షల కట్నం అడుగుతున్నారు. మేం రూ.5లక్షలు ఇస్తామని చెప్పినం. అయినా రావడం లేదు. ఎమ్మెల్యే దగ్గరకు కూడా పోయినం. ఆమె ఓ వైస్​ఛైర్మన్​కు అప్పజెప్పారు. ఆయన చెప్పినా కూడా శ్యామ్ వినడం లేదు. వాళ్ల కుటుంబ సభ్యులే మా పెళ్లి జరగనివ్వడం లేదు.'

-బాధితురాలు

పంచాయితీ పెట్టినా వినడం లేదు.. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇలా పోరాటం చేస్తున్నట్లు బాధితురాలు కన్నీటిపర్యంతమైంది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details