భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సంబయిగూడెం గ్రామంలో బీటీపీఎస్ నిర్మాణ కార్మికులు నివాసముంటున్న ప్రాంతాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరావు, జడ్పీటీసీ పోశం నరసింహారావు శనివారం పరిశీలించారు. నివాస ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై నిర్మాణ కంపెనీ ప్రతినిధులను ఎంపీడీఓ ప్రశ్నించారు. కార్మికుల నివాస ప్రదేశాల్లో స్వచ్ఛత పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. అనంతరం జెన్కో డైరెక్టర్ అజయ్, బీటీపీఎస్ సీఈ అధికారి బాలరాజుతో చర్చించారు. నివాస ప్రదేశాల్లో నీరు నిలవకుండా ఫాగింగ్ స్ప్రే తదితర పనులు చేస్తామని జెన్కో డైరెక్టర్ హామీ ఇచ్చారు.
అపరిశుభ్రంగా కార్మికుల నివాస ప్రాంతాలు - మణుగూరు
భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేసే నిర్మాణ కార్మికుల నివాస ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అపరిశుభ్రంగా కార్మికుల నివాస ప్రాంతాలు