తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్యాస్​తో వ్యవసాయ మోటార్​.. రైతుల కోసం రూపకల్పన

పెట్రోల్​, కిరోసిన్​ ఖర్చులు ఎక్కువ అవుతున్నందున ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ఖర్చు గల గ్యాస్​తో వ్యవసాయ మోటార్ రూపొదించి.. దానిని రైతులు వినియోగించవచ్చని చెప్తున్నాడు భద్రాద్రి జిల్లా ఇల్లందుకు చెందిన సమీ ఉల్లా.​

By

Published : Jan 28, 2020, 8:49 PM IST

గ్యాస్​తో వ్యవసాయ మోటార్​.. రైతుల కోసం రూపకల్పన
గ్యాస్​తో వ్యవసాయ మోటార్​.. రైతుల కోసం రూపకల్పన

గ్యాస్​తో వ్యవసాయ మోటార్​.. రైతుల కోసం రూపకల్పన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మోటార్ మెకానిక్ సమీ ఉల్లా... రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని పరి తపించాడు. పెట్రోల్​, కిరోసిన్ కొరత కారణంగా గ్యాస్​తో నడిచే వ్యవసాయ ఇంజిన్​ను రూపొందించాడు. పెట్రోల్, కిరోసిన్​తో పోలిస్తే తక్కువ ఖర్చు ఉన్న గ్యాస్​తో రైతులు ఈ మోటార్ వాడుకోవచ్చని సమీ ఉల్లా తెలిపారు.

గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తన ప్రయోగాన్ని పరిశీలించాల్సిందిగా కోరినా.. అధికారుల నుంచి స్పందన రాలేదని సమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన ప్రయోగాన్ని పరిశీలించి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్ని కళాశాలలు, యూనివర్సిటీల అవగాహన కార్యక్రమాలైన ఇన్నోవేషన్ యాత్రలో తనకు అవకాశం కల్పించాలని సమీ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:'కరోనా'​కు మందు కనుగొన్న తమిళ వైద్యుడు!

ABOUT THE AUTHOR

...view details