భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ తెలంగాణ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక ఛైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్, పురపాలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇల్లందులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - gandhi jayanti story
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ తెలంగాణ నినాదంతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్‌లోని మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![ఇల్లందులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు gandhi jayanthi celebrations in illandhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9020407-367-9020407-1601624332087.jpg)
gandhi jayanthi celebrations in illandhugandhi jayanthi celebrations in illandhu
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గాంధీచౌక్‌లో మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.